శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నీరు నిలిపివేత
నిజామాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదలను నిలిపివేస్తున్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ జగదీశ్వర్ తెలిపారు. డ్యామ్లో తగినంత నీటి నిల్వలు లేనప్పటికీ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో సాగు చేస్తున్న పంటలను కాపాడేందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఓ తడి కోసం సాగు నీరు
విడుదల చేసినట్టు పేర్కొన్నారు. కాకతీయ కాలువ, సరస్వతి కాలువ, లక్ష్మీ కాల్వ, వరద కాలువ, అలీ సాగర్ గుత్ప లిఫ్ట్ ఇరిగే షన్ పథకాల ద్వారా ఒక తడి కోసం 9 టీఎంసీల నీటిని ఈ నెల 10, 20వ తేదీల్లో విడుదల చేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ప్రాజెక్టులో మిగిలి న 36 టీఎంసీల నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే వాడనున్నట్టు పేర్కొన్నారు.




