శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తెలంగాణ

ఈ నెల 28న నిరసన ర్యాలీని విజయవంతం చేయండి: మహిళా కాంగ్రెస్ పిలుపు

28న చేపట్టనున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయండి : - ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ నెల 28న హైదరా బాద్ లో నిర్వహించ తలపెట్టిన భారీ నిరసన ర్య

Staff Reporter27 September 2026, 8:19 AM16 చూసులుtrinetnews.com
ఈ నెల 28న నిరసన ర్యాలీని విజయవంతం చేయండి: మహిళా కాంగ్రెస్ పిలుపు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

28న చేపట్టనున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయండి :

- ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్

కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ నెల 28న హైదరా బాద్ లో నిర్వహించ తలపెట్టిన భారీ నిరసన ర్యాలీని విజయ వంతం చేయాలని ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షు రాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడారు. తె లంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహే ష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్ర మంలో తెలంగాణ ప్రదేశ్ మహి ళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబె ల్లి స్వర్ణక్క ఆదేశాలతో నిర్వహిం చనున్న ఈ ఆందోళన కార్యక్రమా నికి మహిళా కాంగ్రెస్ నాయకు రాళ్లు భారీ సంఖ్యలో పాల్గొని కా ర్యక్రమాన్ని విజయవంతం చేయ వలసిందిగా వారు కోరారు. ఏఐ సీసీ, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు ట్యాంక్ బండ్ --లిబర్టీ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యా లీ ప్రారంభమై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు కొనసాగుతుందని ఆమె తెలిపా రు. అనంతరం ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించ నునట్లు తెలిపారు. ఈ కార్యక్ర మానికి మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యద ర్శులు, కార్యదర్శులు, జిల్లాలోని అన్ని డివిజన్లకు చెందిన మహి ళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

మిగతా చదవండి →